Shambala Movie: శంబాలా మూవీ అప్డేట్..! 8 h ago
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ హీరో గా నటిస్తున్న "శంబాలా" మూవీ నుండి అప్డేట్ వచ్చింది. ఆది పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ మేకర్ లు తన మొదటి లుక్ ను పోస్ట్ చేశారు. అందులో ఆది మండుతున్న పొలంలో సైకిల్ తొక్కుతూ కనిపించారు. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని యుగంధర్ ముని తెరకెక్కిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ పథకంపై ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు.